Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బిగ్ షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
- శర్మిష్ఠ పనోలీ మధ్యంతర బెయిల్‌ను నిరాకరించిన కోల్‌కతా హైకోర్టు..
- శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఉన్నతస్థాయి న్యాయస్థానం..
- 14 రోజుల పాటు శర్మిష్ఠ పనోలీని జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharmishta Panoli: పూణేకు చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకు కోల్‌కతా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆపరేషన్ సింధూర్‌పై సినీ ప్రముఖులు మౌనం వహించడంపై శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అని ప్రశ్నించింది.
Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
అయితే, వాక్ స్వాతంత్ర్యం సంపూర్ణం కాదు.. మతపరమైన వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఈ హక్కు వీలు కల్పించలేదని గుర్తు పెట్టుకోవాలని కోల్‌కతా హైకోర్టు సూచించింది. శర్మిష్టకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఆమె వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ, ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడటం దాని అర్థం కాదు అని పేర్కొనింది. మన దేశం వైవిధ్యభరితమైంది.. అనేక కులాల, మతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపింది. అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోల్‌కతా హైకోర్టు వెల్లడించింది.
Read Also: Minister Savitha: జగన్.. రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే..
కాగా, శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరించిన న్యాయస్థానం.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే, ఉగ్రవాదులు పహల్గాంలో పురుషులపై జరిపిన మారణహోమం తర్వాత ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌పై కొందరు బాలీవుడ్ ప్రముఖుల సైలెంట్ గా ఉండటాన్ని ప్రశ్నిస్తూ మే 14వ తేదీన శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్టుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తన పోస్టులు, రీల్స్ తొలగించిన తర్వాత ఆమె క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది. అనంతరం శర్మిష్ఠను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!