గులాబీ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కు అతి భారీ వర్షం ముప్పు తప్పిందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది. జీహెచ్ఎంసి పరిధిలో అక్కడక్కడా తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. అయితే ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. ఈ రాత్రికి ఒక మోస్తరు వర్షం… దఫా దఫాలుగా కురిసే…
గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి,…
తెలుగు రాష్ట్రాలకు వాన గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని…
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు…
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ రోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు…
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర ప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో…
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిషా తీరాన్ని ఆనుకుని గంటకు 5కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతుంది. ఒడిషాలోని చాంద్ బలి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ,తెలంగాణాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖా అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు రోజులుగా ముసురు ముసుగులో ఉన్న విహాయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గంటకు 45-55కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం…
ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో… వచ్చే రెండు రోజులు ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడొచ్చంటోంది… వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులు వేటకు…