వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిషా తీరాన్ని ఆనుకుని గంటకు 5కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతుంది. ఒడిషాలోని చాంద్ బలి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ,తెలంగాణాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖా అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు రోజులుగా ముసురు ముసుగులో ఉన్న విహాయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గంటకు 45-55కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వరదల కారణంగా వాగులు, నదులు అన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్న జలపాతాల్లో కూడా వరద ఉధృతి పెరిగింది.