Wayanad Landslides : నిరంతర భారీ వర్షాల తర్వాత కేరళలోని వాయనాడ్‌లో అతిపెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జులై 30 ఉదయం ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Wayanad Landslides : భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే ఘోర ప్రమాదాలలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు.
కేరళలోని వయనాడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి.
వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.
వయనాడ్‌లో రుతుపవన వర్షాల కారణంగా సంభవించిన పలు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది.
భారీ వర్షాల మధ్య కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. అంతేకాకుండా.. 116 మంది గాయపడ్డారు. కొండచరియల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Huge Landslides Strike in Wayanad: కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఎ) బాధిత ప్రాంతాలకు ఫైర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా వాయనాడ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ బృందాలు కూడా రెస్క్యూ…