నదులు, బురద ప్రవాహం మధ్య ప్రజల మృతదేహాలను కనుక్కోవాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరమైనది. ఎక్కడ చూసినా ప్రజల అరుపులు మిన్నంటుతున్నాయి.
వాయనాడ్ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ అననుకూల వాతావరణం మధ్య తప్పిపోయిన వారి కోసం ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.
ప్రజలు తమ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ విధ్వంసం చాలా ఇండ్లను ధ్వంసం చేసింది, ప్రతిచోటా వర్ణణాతీతమైన బాధ కనిపిస్తుంది.
ఇప్పటి వరకు ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వివిధ ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.
చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. ఇందులో చాలా మంది ప్రజలు గల్లంతైనట్లు చెబుతున్నారు.
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వస్తున్న చిత్రాలలో విధ్వంసం దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం పూర్తిగా పాడైపోయి మట్టిలో ఎలా కప్పబడిందో ఈ చిత్రాలలో చూడవచ్చు. ధ్వంసమైన వాహనాలను చూస్తే విధ్వంసం ఏ రేంజ్ లో జరిగిందో అంచనా వేయవచ్చు.
జూలై 30, 2024న, వాయనాడ్ ప్రజల ఉదయం చాలా బాధాకరంగా ఉంది. చాలా మందికి కళ్ళు తెరవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, నదుల ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు.
కొండచరియలు విరిగిపడటంతో నదుల ప్రవాహం వేగంగా మారింది. శిథిలాలలో చిక్కుకుని చాలా మంది చనిపోయారు. పలువురు కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.
నదుల ప్రవాహానికి ప్రజలతో పాటు పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రామ ప్రాంతాలలో చుట్టూ నీరు కనిపిస్తుంది. విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.
భారీ వర్షాల మధ్య ప్రజలను రక్షించే పనిలో NDRF మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.