మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంలేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో రోజురోజుకు గ్రాఫ్ పడిపోయింది.. త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం హన్మకొండ హరిత కాకతీయలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది.
వరంగల్ లో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ ఫేక్ బాబాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు.
వరంగల్ లో హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సుమారు వెయ్యి మంది కార్మికులు పని చేస్తున్నారు. రూ. 20 లక్షల 76 వేల ఎస్ఎప్టీ తో హెల్త్ సిటి నిర్మిస్తున్నామని హరీష్ రావు అన్నారు.
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
వరంగల్ లోని ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అవుతోంది.
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.