ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
జులై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు, ప్రధాన మంత్రి వరంగల్ జిల్లాకు చేరుకుని, దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి, బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు పునాది వేస్తారు. ఇందులో నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల-వరంగల్ సెక్షన్ కూడా ఒకటిగా ఉంది. దీని ద్వారా మంచిర్యాల-వరంగల్ మధ్య దూరం దాదాపు 34 కిలోమీటర్లు తగ్గడమేగాక ప్రయాణ సమయం కూడా ఆదా కావడంతో సహా జాతీయ రహదారి 44, 65లలో వాహన రద్దీ తగ్గుతుంది.
Read Also: Health Tips: వర్షాకాలంలో ఇవి అసలు తినొద్దు.. ఆరోగ్యానికి హానికరం..!
అలాగే జాతీయ రహదారి పరిధిలో 68 కిలోమీటర్ల కరీంనగర్-వరంగల్ సెక్షన్‌ను రెండు నుంచి నాలుగు వరుసలుగా ఆధునీకరించే పనులకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్‌లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల అనుసంధానంకు ఇది ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కాజీపేటలో రూ.500 కోట్లతో గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: Harish Rao: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
ఈ అత్యాధునిక కర్మాగారం వ్యాగన్ తయారీ సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఇది ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో పాటు వ్యాగన్లకు రంగువేసే రోబోటిక్ యంత్రాలు, అత్యధునాతన యంత్ర సామగ్రితో పాటు ఆధునిక సామాగ్రి నిల్వ-నిర్వహణ తదితర సౌకర్యాలతో ఏర్పాటు చేయబడుతుంది. దీనిద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సమీప ప్రాంతాల్లో అనుబంధ యూనిట్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.