Warangal: ప్రైవేట్ ఆస్పత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు..18మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆసుపత్రులపై పోలీసులు నిఘా పెట్టారు. నలింగ నిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వారి నుంచి 18 సెల్ ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నారు. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Also: Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
నర్సంపేట కేంద్రంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విస్తు పోయే విషయం ఏంటంటే.. ఆయుర్వేద వైద్యులు కూడా అబార్షన్లు చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వైద్యులు, సిబ్బంది అందరినీ అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరలో వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులనుంచి అబార్షన్ల కోసం రూ. 30వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నే పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నే పూర్ణిమ, వర్ని ప్రదీప్ రెడ్డి, కీతా రాజు, కాళ్ల అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. బాల్నే ఆశాలత, కొంగర రేణుక, భూక్య అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్. మరికొంత మంది పరారీలో ఉన్నారు.
Read Also: Karnataka: మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!