రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో స్ప ష్టత వచ్చింది. ప్రీతి . మృతికి గల కారణాలపైనా పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆమెది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా 306గా ఈ కేసును నిర్ధారించామని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరంగల్ సీపీనీ కలిసిన మెడికో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనేందుకు వరంగల్ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. 94 గజాల స్థలం కోసం సొంత తమ్ముడికి ఇవ్వడం ఇష్టం లేని అన్నా తమ్ముడి పైన పెట్రోల్ పోసి అంటించి ఆ తరువాత తల పైనా బండ రాయి మోదీ చంపిన ఘటన వరంగల్ లో తీవ్ర సంచలనంగా మారింది.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని…
కాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీపై దాడి జరిగింది. ఎస్- 1 కోచ్‌లో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డారు.
హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాదిర్ అహ్మద్ (53), అతని పెద్ద కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (47) ఫారాహీనా పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు.