Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఎఎస్ పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు. ఈ నిరసనలో TGTA ల సంఘం నాయకులు ఎమ్మార్వోలు మహమ్మద్ ఇక్బాల్, విక్రమ్ కుమార్,బండి నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు.
Read also: Hyderabad KPHB: ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు..
ఏం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.. అయితే నిన్న అభిప్రాయ సేకరణకు రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అటు అధికారులు.. ఇటు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత గ్రామస్తులు సహనం కోల్పోయారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడికి దిగారు. దీంతో.. వారు పరుగులు పెట్టక తప్పలేదు. కానీ కలెక్టర్ ప్రతీక్ జైన్ తో సహా రెవెన్యూ అధికారులు కారెక్కిన గ్రామస్తులు వదిలిపెట్టలేదు. కార్లపైన కూడా దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిపై కూడా దాడి చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని గ్రామస్థులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసులు 28 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీలతో భేటీ..