ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పిక్కోని తింటున్న దృశ్యం దర్శనమిచ్చింది. ఈ ఘటన ఎక్కడో ఆస్పత్రి ఆవరణలోని మూల ప్రాంతంలో కాదు.. అందరూ తిరుగుతుండే క్యాజువాలిటీ ముందు కనిపించింది. అయితే.. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయనే వివరాలను ఆస్పత్రి అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Warangal Bhadrakali Ammavaru in Shakambari Alankarana: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారు ‘శాకంబరీ’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన ఆదివారం అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనం ఇచ్చారు. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తాగునీటి…
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు.
నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట…
రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి…
రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.