రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tragedy in Warangal Private Hospitals: వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఘాతుకం. ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న రెండు ప్రైవేట్ హాస్పిటల్స్. వైద్యం చేతగాక ఒక హాస్పిటల్ డబ్బులు కట్టలేదు అని మరొక హాస్పిటల్ ఈనెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సంరక్ష హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వాణికి ఆపరేషన్ చేపిస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో.. రోగికి ఆపరేషన్ చేయించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్…
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు…
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు,…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉండనుంది. కాగా.. ఎల్లుండి (సోమవారం) పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఉ.8 గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగనుంది. అందుకోసం 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.