డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రైస్ పుల్లింగ్ కి వినియోగించే రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లును నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు వరంగల్ పోలీసులు. వరంగల్…
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్…
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్‌టాప్‌లు,…
రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… తాజాగా వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన విస్మయానికి గురిచూస్తోంది.. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.. కానీ, వరంగల్ పోలీసు వారి ఆటలను సాగనివ్వలేదు.. అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన వత్రాలు, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్…
జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై…
అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా…