నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
నగరం, పట్టణాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా శబ్ధ కాలుష్యం రోజు రోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధిక తీవ్రత కలిగిన శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హారన్లు, సైలెన్సర్ల వినియోగంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్దకాలుష్యం నమోదవుతోంది. దీంతో ప్రజలకు అనారోగ్య, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు.
పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ. దింతో బాధితురాలు కాకతీయ…
Konda Surekha: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్‌పై పోలీసులు దాడి చేయడంతో వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఏదో ఒకటి చేయమని అడిగారని, ఇష్టానుసారంగా దుర్భాషలాడారని, లాఠీలతో కొట్టారని ఆరోపించారు.
Warangal: బహిరంగంగా తల్వార్ (కత్తులు) ప్రదర్శించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న తల్వార్ లు, కత్తుల సంస్కృతిపై దృష్టి సారించారు సీపీ.