Dummy Currency Gang: డమ్మీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రైస్ పుల్లింగ్ కి వినియోగించే రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లును నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు వరంగల్ పోలీసులు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్, వర్ధన్నపేట పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలపై దాడులు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. అదనపు సంపాదన కోసం మోసాలకు సిద్ధపడ్డారు 8 మంది సభ్యులు. నకిలీ నోట్ల దందాతో పాటు రైస్ పుల్లింగ్ కి ప్లాన్ చేశారు. అందులో భాగంగా 50 వేల అసలు నోట్లకు మూడురెట్ల నకిలీ నోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకొని పోలీసుల నకిలీ నోట్లు పట్టు పడకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు రెండువేల రూపాయల నకిలీ నోట్లను నలుపు కాగితాలుగా మార్చి, వాటిని తిరిగి నలుపు రంగులో వున్న కాగితాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయడంతో తిరిగి నలుపు కాగితాలు 2వేల నకిలీ నోట్లుగా మార్చే ప్రక్రియను వీడియో తీశారు నిందితులు.
దీని ఆధారంగా నకిలీ నోట్లను ఇచ్చేందుకు నగరంలో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 8 మంది ముఠా లోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ముమ్మాడి ధనుంజయ్ ఆలియాస్ శివ వనపర్తి జిల్లా, గుట్టా హరిప్రసాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, గడ్డం నాగరాజు ఇల్లందు గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, చల్లా మహేష్, గొర్రెకుంట వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజు వర్ధన్నపేట, అశోక్ పెద్దమ్మగడ్డ, కిషన్ కామారెడ్డి, సతీష్ మహబూబాబాద్‌కు చెందిన వారు పరారీలో ఉన్నారు.
Read Also: Unstoppable: చిరంజీవి ‘అన్ స్టాబుల్’ షో కు రాకపోడానికి కారణం అదే!
ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్ల చలామణితో పాటు. అతీంద్రీయ శక్తులు ఉన్న పాత్రల్ని అమ్మేదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. రైస్ పుల్లింగ్ కోసం వాడే రాగి పాత్రలు, గోపురం కలశాలు, రాగి నాణేలను వివిధ రసాయలతో పురాతన వస్తువులుగా మార్చి అమ్మకాలు చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలను పోలీసులు రట్టుచేశారు. వారి దగ్గర నుండి. రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనంచేసుకున్నారు. సామాన్యులు మోసపోకుండా ముందే మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన వర్ధన్నపేట సీఐ సదన్ కుమార్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను వరంగల్ సీపీ అభినందించారు.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!