Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకున్న పరిస్థితి, జాప్యానికి కారణాల పై కూడా చర్చ జరగాలని కోరానని ఆయన మీడియాకు తెలిపారు. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు ఏర్పాటు కావాలన్నారు లావు కృష్ణదేవరాయులు. విజయవాడ లో వరద భీభత్సం నేపథ్యం లో, దేశంలో పలు నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయని, ప్రకృతి వైపరీత్యాల పై పార్లమెంటులో విపులంగా చర్చ జరగాలని కోరానని ఆయన తెలిపారు.
Mann Ki Bath: కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే?
అంతేకాకుండా..’ నదుల అనుసంధానంపై కూడా చర్చ జరగాలని కోరాను. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తో ఏపీలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో జరిగే నదుల అనుసంధానం దేశానికే ఆదర్శం, స్పూర్తిదాయకం కావాలి. కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆచార్య రంగా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో, కౌలు రైతుల ఈతిబాధలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. అలాగే, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను కూడా సమగ్ర చర్చించాలి. సోషల్ మీడియా విశృంఖలత్వం పై చర్చ తో పాటు, కట్టడి చేసేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. “వక్ఫ్” పై చర్చ పూర్తి కాలేదు. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. ముస్లింల అభీష్టం మేరకు, బిల్లు రూపకల్పన జరగాలి. అదానీ వ్యవహారంలో ఏపి ప్రస్తావన రావడం దురదృష్టకరం. ఏపీకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇలాంటి సంఘటనలకు కారకులైన వారిని సమర్ధించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరిని సమర్థించకూడదో తెలుసుకోవాలి, గ్రహించాలి.’ అని లావు కృష్ణదేవరాయులు వ్యాఖ్యానించారు.
Mann Ki Bath: కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే?