కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు సీబీఐ మాజీ జేడీ.. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు దరఖాస్తు చేసుకోవడం.. పార్టీ పేరు కూడా ఖరారు అయ్యిందని.. ఇక ప్రకటనే మిగిలింది అంటున్నారు..
వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందికోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి…
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…