VV Lakshminarayana: ఇంకా సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు.. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు.. అయితే, మంచి ఓట్లు సాధించినా.. ఆయన విజయం సాధించలేకపోయారు.. ఆ తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు.. జనసేన పార్టీకి కూడా బైబై చెప్పేశారు. ఇక, ఆయన మళ్లీ పోటీ చేస్తారా? చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అసెంబ్లీ స్థానం బరిలోనా? లోక్‌సభ స్థానం నుంచి పోటీయా? అంటూ అనేక విషయాలపై చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు లక్ష్మీనారాయణ..
Read Also: Kodali Nani: ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వోచ్చావా..? యార్లగడ్డపై సెటైర్లు
ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.. అయితే, ఎక్కడ నుంచి అనేది త్వరలో చెబుతాను అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును వాడనప్పుడు.. ఓటు బ్యాంకింగ్‌గా మారుతుందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొనసాగేది అదే అన్నారు. ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ఆదాయపన్ను పెంచడం లాంటి జరినామాలు కూడా విధించాలని సూచించారు. ఓటు హక్కుతో మంచి నాయకున్ని ఎంచుకొవాలి.. అది ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కాగా, గతంలో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ.. మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా ఓ సందర్భంగా వెల్లడించారు.. అయితే, ఈ సారి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఎక్కడి నుంచి పోటీ చేస్తానో త్వరలో చెబుతాను అనడంతో.. విశాఖ నుంచి కాకుండా.. మరేదైనా స్థానం నుంచి పోటీ చేస్తారా? అనే చర్చ సాగుతోంది.