దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి…
చిత్తూరు జిల్లాలో నలుగురు విఆర్ఓలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా పరిష్కారమైన అర్జీదారుల స్పందనను ఐవిఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. సమాచార సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వీఆర్వోల్లో బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి విఆర్వో, ఎస్ ఆర్ పురం నెలవాయి విఆర్వో, గంగవరం మండలం…
VRO: వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూభారతి బిల్లుల్లో గ్రామస్థాయిలో కొత్త రెవెన్యూ అధికారులను నియమిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు…
వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది.
అతడో వీఆర్వో. బాధ్యతగా మెలగాల్సిన అతడు పాడుబుద్ధి చూపించాడు. అప్పటికే పెళ్లైన అతగాడు.. భార్యకు సంతానం కలగడం లేదని ఓ యువతికి రెండో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం మొహం చాటేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్ మండలంలో బోయ కార్తీక్ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను బషీరాబాద్ మండలం దామర్‌చేడ్ గ్రామానికి చెందినవాడు. ఇతనికి ఇంతకుముందే పెళ్లయ్యింది. అయితే, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని ఓ యువతికి మాయమాటలు చెప్పి, ఆమెపై…
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకు బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అధికారులు మాత్రం.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతి చెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతి చెందారా? అనేది తేలుతుందని అంటున్నారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు.…