VRO: వీఆర్వోల నియామక ప్రక్రియ షురూ.. పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు..
- వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు..
- మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VRO: భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూభారతి బిల్లుల్లో గ్రామస్థాయిలో కొత్త రెవెన్యూ అధికారులను నియమిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల్లో పని చేసేందుకు రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. సర్వేయర్ల నియామకంపైనా దృష్టి సారించింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసి ఇతర విభాగాలకు బదిలీ అయిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. అలాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
Read also: High Court: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్..
Also Read
గూగుల్ ఫారమ్‌లలో వివరాలను నింపాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లాలనుకునే వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో గ్రామస్థాయి అధికారులతో పాటు సర్వేయర్‌గా కూడా పనిచేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఉన్న వీఆర్వోల పూర్తి వివరాలను ఆప్షన్ల ద్వారా సేకరిస్తున్నారు. మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? ఏ విభాగంలో? ఉద్యోగి ఐడీ? ప్రస్తుత పోస్ట్‌లో నియామకం తేదీ? రెవెన్యూ శాఖలో చేరిన తేదీ? విద్యార్హతలు, ఏ జిల్లా? మీరు ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వివరాలు ఉన్నాయి.
Read also: JPC First Meeting: జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం..
సర్వేయర్‌గా పనిచేయాలంటే తప్పనిసరిగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తి చేసి ఉండాలనే షరతు విధించారు. ఈ నెల 28లోగా వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కార్యదర్శి వి.భిక్షం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధికారుల రాకతో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!