Revanth Letter to Kcr: కట్టుబానిసల్లా వీఆర్వోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. వీఆర్ఒలకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయడంలేదని మండిపడ్డారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయాలన్న సోయి మీకు లేదన్నారు రేవంత్.
శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్నారు. వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలని, వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోంది. రాష్ట్రంలో విధులు లేకుండా ఐదు వేల 756 మంది వీఆర్వో లు ఖాళీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు అన్యా యం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వీఆర్వోలు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!