చిత్తూరు జిల్లాలో నలుగురు విఆర్ఓలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా పరిష్కారమైన అర్జీదారుల స్పందనను ఐవిఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. సమాచార సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వీఆర్వోల్లో బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి విఆర్వో, ఎస్ ఆర్ పురం నెలవాయి విఆర్వో, గంగవరం మండలం గండ్రాజుపల్లి విఆర్వో, నిండ్ర మండలం అగరంకు విఆర్వోలను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.