Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసేందుకు వచ్చే సహాయకుల కుడి చేతి వేలిపై సిరా గుర్తును వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై 'ఓట్ ఇండియా - సేవ్ డెమోక్రసీ' పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్‌లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ధర్మానికి, న్యాయానికి,అన్యాయానికి,అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలె మునుగోడు ఉప ఎన్నికలు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడుల్లో టీఆర్ఎస్ కోట్లు కుమ్మరించినా, వారి బలం పెరగడం లేదన్నారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ నేతలు ఓట్ల కోసం పడేపాట్లు అంతా ఇంత కాదు… ఎప్పటికప్పుడు వినూత్న తరహాలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. డబ్బులు, మద్యం.. ఇలా ప్రలోభాలకు కూడా తక్కువేం కాదనే చెప్పాలి. ఇక, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. యూపీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ ఓవైపు.. సమాజ్‌వాది పార్టీ ఇంకో వైపు వారి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయితే, ఎస్పీ ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నమే…
తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్టాపిక్గా మారిపోయింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో…