German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు.
Harish Rao : మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది…
జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం 24 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్-1 ఓటింగ్ జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఉదయం నుంచే ఓటర్లు.. ఓటేసేందుకు భారీగా క్యూ కట్టారు.
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు…
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.
ఇప్పుడు రాజకీయాల్లో లేను.. అలాగే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది అని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
మే 13న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఉండనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు…
పొలిటికల్ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతిపాదిత లబ్ధిదారుల పథకాల కోసం వివిధ సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను కోరడం ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి పద్ధతి అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Home Voting: మే 3, 4 తేదీల్లో ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నామని.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇక శుక్రవారం తొలి విడత పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. ఇక ఏప్రిల్ 26న సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.