Karnataka: కర్ణాటకలో ఆ 17 వేల మంది ఓటర్లకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 17,000 మందికి పైగా ఉన్నారు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఇదే అత్యధికం. కర్ణాటకలో ఉన్న 12.15 లక్షల మంది ఓటర్లలో 80 ఏళ్లు పైబడి వారే అధికంగా ఉన్నారు. వీరిలో 16,976 మంది వందేళ్లు పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారని ఈసీ తెలిపింది. కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే (VFH) సదుపాయాన్ని ఎన్నికల సంఘం గతంలో ప్రవేశపెట్టింది. కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
Also Read:Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు
రాష్ట్ర అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని అధికార బిజెపి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం వర్గానికి మత ఆధారిత రిజర్వేషన్‌ను రద్దు చేసింది ప్రభుత్వం. కన్నడిగుల సమస్య, లింగాయత్, వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!