పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలి. ఏం రకంగాను ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టిడిపి సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదన్నారు సజ్జల.
Read Also: Dhulipalla Narendra: వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు
ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు?మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టిడిపి పోటీ చేసింది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: Covid variant XBB1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు 76 నమోదు..