Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. READ ALSO: DMF…
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల…
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర…
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది,…
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం.. ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కొనసాగనుంది.. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుంది.. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు.. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతులు పరిష్కరించనున్నారు.. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ చేయనున్నారు.. 2022 జనవరి 5న ఓటర్ల…