ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. ఈవీఎం ల విషయంలో అనుమానాలున్నాయన్నారు. ఓటింగ్ మిషన్లు వద్దని బ్యాలెట్ పేపర్ కి వెళ్ళాయి.. బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు.. తెలంగాణలో వేలం పాట లాగా హామీలు ఇచ్చారని చెప్పారు. 420 హామీలు ఇచ్చారు.. చివరకు బాండ్ పేపర్ల పై రాసిచ్చారని.. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండక పోతే చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వం రద్దు చెయ్యాలన్నారు..
READ MORE: YS Jagan: మూడేళ్ల తర్వాత అధికారం మనదే.. వారంతా జైలుకే..!
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ పై కూడా ప్రశ్నించామని.. రివిజన్ చెయ్యాలి కానీ అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. “అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చెయ్యాలని కోరాం. అవసరం అయితే బూత్ లెవెల్ కమిటీలతో అఖిల పక్షాలను ఏర్పాటు చెయ్యాలి. ఓట్లు ఎందుకు తీసి వేస్తున్నారో . కారణాలు తెలపాలి. అన్ని పార్టీల సమ్మతితో చెయ్యాలి. భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ఖర్చు, దొంగ హామీలు.. వంటి అంశాలపై చర్చ జరిపాం. కార్ గుర్తును పోలిన 8, 9 సింబల్స్ ను తొలగించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా.. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల మేం ఓడి పోయాం. కార్ గుర్తును పోలిన వాటిని తక్షణమే తొలగించాలి.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.