ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో బాగానే టిఆర్ఎస్ పార్టీని సమావేశానికి ఆహ్వానించింది.
Also Read:Travel Loan: జల్సాలకు లోన్ తీసుకుంటున్న యువత.. సర్వేలో సంచలన విషయాలు..!
కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ బృందం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేసింది.. భారత్ లో ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో, ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. నవంబర్ లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాదు ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయని, వాటిని అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోతే చర్యలు కూడా తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బిఆర్ఎస్.
Also Read:Uttarakhand Floods: ఉత్తర కాశీ జిల్లాలో వరద బీభత్సం.. 60 మందికి పైగా గల్లంతు!
మరోపక్క బీహార్ లో జరిగిన ఓట్ల జాబితా సమగ్ర సర్వేపై కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియను బూత్ స్థాయి నుంచి అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనర్హుడికి ఒక ఓటు వచ్చినా సరే, ఏ ఒక్క అర్హుడు కూడా ఓటు కోల్పో వద్దన్నారు కేటీఆర్. ఎన్నికల గుర్తులు నుంచి తమ పార్టీ సింబల్ అయిన కార్ గుర్తును పోలి ఉన్న గుర్తులను తక్షణమే తొలగించాలని.. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో పోలివున్న గుర్తులవల్ల తమ పార్టీ అభ్యర్థులు నష్టపోయారని కేటీఆర్ గుర్తు చేశారు..