Volunteers Police Complaint Against Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న ఆయన ఒక పక్క అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థ మానవ అక్రమ రవాణాకు తోడ్పడుతుందని…
వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు పవన్
సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అతిచిన్న జీతం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ పొట్టగొట్టాలని నాకులేదన్నారు పవన్ కల్యాణ్ .. ఐదువేల జీతం ఇచ్చి వారిని అక్కడే కట్టిపడేస్తున్నారు.. వారిలో ఎంతోమంది బలవంతులున్నారు.. వారిలో సైంటిస్టులు, వ్యాపారస్తులు ఇలా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లున్నారన్నారు.. డిగ్రీ చదువుకుని ఐదువేలు ఇస్తూ ఊడిగంచేపిస్తున్నారు.. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చే డబ్బులు కూడా వారికి రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్…