Nadendla Manohar: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించారు.. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.. ఇక, ప్రతిగా కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు పవన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. మరోవైపు మంత్రులు, వైసీపీ నేతలు కూడా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.. అయితే, వాలంటీర్ల వ్యవహారంలో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పధకాలు తీసుకొని వాళ్ల వివరాలు, ఫోటోలు, ఆధార్ కార్డులు, చిన్న పిల్లల వివరాలను.. వాలంటీర్స్ ఎందుకు తీసుకుంటున్నారు..? అని నిలదీశారు.
Read Also: Posani Krishna Murali: పవన్‌కి పోసాని ఛాలెంజ్.. నీకు ఆ దమ్ముందా?
ప్రభుత్వంతో అసలు వాలంటీర్లకు సంబంధం ఏంటి? అని నిలదీశారు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వం తరపున వాలంటీర్లు పని చేస్తే అధికారులు మాట్లాడకుండా వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. వాలంటీర్స్ ద్వారా ప్రజలను మభ్య పెట్టి.. వచ్చే ఎన్నికలో లబ్ధి పొందాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విరుచుకుపడ్డారు. ఆడపిల్లల భద్రత కోసం పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే.. వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు..? రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి ఏమిటా మాటాలు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని అన్నారు.. పవన్ కల్యాణ్ సమస్యలపైన విమర్శిస్తున్నరు.. కానీ, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదని స్పష్టం చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.