CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైన్యం.. చంద్రబాబుకు కడుపు మంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ల వ్యవస్థ అంటూ వారి సేవలను కొనియాడారు.. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫించన్ ఇచ్చారా ? అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
గతంలో జన్మభూమి కమిటీ అరాచకాలు, వివక్ష, లంచాల ద్వారానే పథకాల అమలు అయ్యేవని విమర్శించారు సీఎం జగన్.. తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని ప్రశంసించిన ఆయన.. ప్రభుత్వం చేసిన పని ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెళ్ళకు ఇచ్చామని గుర్తిచేశరాఉ. కానీ, అన్యాయమైన రాజకీయాల మధ్య మనం ఉన్నాం.. పేదల ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతి గడపకు వెళ్లి చెప్పే వాలంటీర్లు మనకి అండగా ఉన్నారు.. ప్రభుత్వానికి చేసే సేవ చేస్తున్నారు ఈ వాలంటీర్లు.. సేవ చేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. కేవలం సేవ చేయాలని తపన ఉన్న వారే ఈ వాలంటీర్లు అని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు.
Read Also: Charan NTR: జపాన్‌లో జెండా పాతిన చరణ్, ఎన్టీఆర్!
ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వ పథకం అందాలి.. చంద్రబాబుకి వాలంటీర్ల వ్యవస్థ అంటే కడుపు మంట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్.. 10 జెలేసిన్ మాత్రలు వేసుకున్నా చంద్రబాబుకి కడుపు మంట తగ్గదు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. వాలంటీర్లకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఫైర్ అయ్యారు.. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకునే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు.. టీడీపీ అధికారంలోకి వస్తే తమ వారిని జన్మ భూమి కమిటీలు తెస్తామని చంద్రబాబు అంటున్నారన్నారు. జగన్ కు వాలంటీర్లు ఒక సైన్యం.. వాలంటీర్లు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!