టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు, లోకేష్ లు జాతర లలో పాల్గొంటూ జనం రావడం లేరన్న ఫ్రస్టేషన్ వల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..అంబోతులా లోకేష్ మహిళను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు. జగన్ పాదయాత్ర చేసినపుడు.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు… రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. చంద్రబాబు సొంత ఊరు వదిలి తిరుగుతున్నారు.. మీరు బూతులు మాట్లాడితే మేమూ మాట్లాడుతాము..మా సహనాన్ని మీరు పరీక్షిస్తే మేమూ మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త..రాయలసీమకు ఏమీ చేయకుండా మాట్లాడటం సరైంది కాదు..మీరు చేసిన ఆరోపణల పై నిజాయితీగా మా ఎమ్మెల్యే రాచమల్లు సీబీఐ విచారణకు వెళ్ళారు .. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..సాధికార వ్యవస్థ పెడతామంటే వాలంటీర్లు వ్యవస్థను మీరు అంగీకరించినట్టే. కనీసం కౌన్సిలర్ కూడా కాని లోకేష్ పదవీ కాంక్ష తోనే జనంలోకి వచ్చి దుర్భాష లాడుతున్నాయి.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జ్‌లో ఉపన్యాసం..
అధికారంలో ఉండగా ఏమీ చేయక పోగా ఇప్పుడు ఏం చేస్తారో చేప్పకుండా తిట్ల దండకం తప్ప పాదయాత్రలో ఏముంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పై మంచి చెడ్డలు మాట్లాడ కుండా కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏమీ చెప్పుకోలేని వాళ్ళు కేడర్ ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ ఆరోపిస్తూ బురద జల్లుతున్నారు..నేరుగా జనం ఖాతాల్లోకి రెండు లక్షలు జమ చేసిన వైసిపిని విమర్శించే లోకేష్ సంస్కార వంతంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు.
జగన్ జమ్మలమడుగు కాంబెల్ ఆసుపత్రిలో పుట్టారు..కానీ లోకేష్ రాయలసీమలో పుట్టాడా అని ప్రశ్నిస్తున్న లోకేష్ ఎక్కడ పుట్టాడు .. వైఎస్ అర్ ఈ రాయలసీమ లో పుట్టడం మా అదృష్టం..ఆయన వచ్చాకే రాయలసీమకు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చారు.పోతిరెడ్డిా పాడు వెడల్పు చేశారు..టిడిపి ప్రభుత్వంలో రాయలసీమకు ఎం చేశారు .మంచి చేయలేదు, చెప్పుకునే ధైర్యం లేదు..కరోనాలో కుడితో ఎలుక లాగా తండ్రి కొడుకు దాక్కున్నారు..జూమ్ మీటింగ్ లతో కాలం వెళ్లగక్కారు..మేము బూతులు తిట్టగలము..తెలుగు సరిగా రాని భాషతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..పదే పదే వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీగా మీరు కొనసాగాలంటే సంస్కారంతో మాట్లాడండి.
Read Also: Job Fraud: ఘరానా మోసం.. యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..