పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం అయ్యేటట్లు పర్యవేక్షించమని సీఎం జగన్ చెప్పారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం ముగిసింది. గంటన్నర పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ కు మా అభిప్రాయాలు చెప్పాం. ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి ఈ కార్యక్రమాలు చేరే విధంగా చూడమన్నారు.ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య విబేధాలు ఉంటే సరిదిద్దే బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్లది అని జగన్ పేర్కొన్నారని మంత్రి బొత్స తెలిపారు. ఏడాది పాటు సమావేశాలు నిర్వహించటం మా బాధ్యత అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకుని వెళతాం అన్నారు బొత్స సత్యనారాయణ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.
Read Also: DC vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా రీజినల్ కో ఆర్డినేటర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. వాలంటీర్లు,గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను వీరి ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. నేతల మధ్య విభేధాలను తొలగించడం అసంతృప్తులను సంతృప్తి పరచే బాధ్యత మాదేనన్నారు. ఏడాదిలో ఎన్నికలు వస్తోన్న దృష్ట్యా అసంతృప్తుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అన్నారు.
సీఎం చెప్పినా చెప్పకపోయినా పార్టీలో అసంతృప్తుల వ్యవహారాన్ని చక్కదిద్దడం మా బాధ్యత. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈకార్యక్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం సహా వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం. పార్టీలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటంలో కొత్తేం లేదు. అటువైపు నలుగురు , ఇటువైపు నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ..ఇందులో కొత్తేముంది? అని ప్రశ్నించారు బొత్స.
Read Also:Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకువీరుడు.. చివరికి ఆమె చెప్పులు మోస్తూ..