Putin- Modi Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Su-57 stealth fighter jet: భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్‌ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నారు.
పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికా దగ్గర ఉందని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూనే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు.
Russia Poseidon Drone: రష్యా ప్రపంచాన్ని కుదిపేసింది. తాజాగా మాస్కో నీటి అడుగున అణు జలాంతర్గామి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. పుతిన్ ప్రకటన అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో ప్రకంపనలు సృష్టించదని విశ్లేషకులు చెబుతున్నారు. పుతిన్ ప్రకటన ప్రభావం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ అణు పరీక్షకు ఆదేశించేలా చేసిందని నిపుణులు పేర్కొన్నారు. READ ALSO: CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ…
US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము…
శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ "ఎక్కువగా నిరాశ చెందారు" అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది.
Trump: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అయితే, ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేశారని, ఉదాహరణగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ను చూపారు.