Tribal Students Death: పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో గిరిజన విద్యార్థినుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పార్వతీపురం పరిధిలోని కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంచలనం రేపుతున్నాయి. గత ఐదు రోజులలో అనారోగ్యంతో ఇద్దరు విద్యార్థినలు చనిపోయారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన నేడు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మృతి చెందగా, గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖళ్లు పంచాయతీ కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి గత నెల 26వ తేదీన మృతి చెందింది.
Read Also: Dussehra 2025: రేపే దసరా.. ఇలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.. శని దోషం పోతుంది..!
అయితే, విశాఖపట్నంలోని కేజీహెచ్, కురుపాం, రామభద్రపురం, చిన మేరంగి ఆసుపత్రులలో ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు విద్యార్థినలు చికిత్స పొందుతున్నారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో, ఇంటికి వెళ్లిన విద్యార్థినుల ఆరోగ్యం క్షీణించడంతో తల్లితండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతానికి, ఒకే పాఠశాలలో చదువుతున్న 612 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం ఒక్క సారే క్షీణించడంతో స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.