Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది. సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.
విజయనగరం ఉగ్రకుట్ర లింకుల కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల ఉగ్రకుట్ర కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేశారు. సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. త్వరలోనే నిందితులు ఇద్దరినీ ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోనుంది. ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు…
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో దాదాపు ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రాజు గారు కన్నెర్రజేస్తే ఎలాంటివారైనా పొలిటికల్‌గా ఫట్‌మనాల్సిందేనా? ఆయనకు భజన చేస్తే తప్ప ఆ జిల్లాలో రాజకీయ మనుగడ కష్టమా? బంగ్లా పాలిటిక్స్ వద్దన్న వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయిందా? శతృ శేషం ఉండకూడదన్న టార్గెట్‌తో పిచ్చుకల మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తారా? ఎవరా రాజు? ఏంటాయనగారి రాజకీయ వేట? విజయనగరం జిల్లా టీడీపీ అంటే…. కేరాఫ్ అశోక్ గజపతి రాజనే చెప్పుకుంటారు అంతా. పార్టీ పుట్టిన నాటి నుంచి ఆయన అందులోనే ఉన్నారు.…
విజయనగరం జిల్లాలో ఓ హెచ్‌ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరుతోంది. ఎమ్మెల్యే…