Ashok Gajapathi Raju: అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చేయాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు మాన్సస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చెయ్యాలన్నారు.. రకరకాల సేవులున్నాయి.. అందరం కలిసి చెయ్యాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలన్నారు.. అమ్మవారికి సేవ చేసే బాధ్యత నాపై మా పెద్దలు ఉంచారు.. అలాగే నడుచుకుంటున్నాం.. పారదర్శకత పాటిస్తున్నాం.. పాలక మండలి ప్రమాణ స్వీకారం అలాగే జరిగిందిని గుర్తుచేశారు.. అయితే, చట్టాలను చుట్టాలుగా చూసేవారు వస్తే ఇబ్బంది.. వాళ్లని తరిమికొట్టాలి.. అమ్మవారి కీర్త ప్రతిష్టలను నలుమూలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.. పాలక మండలి ప్రమాణాలను గుర్తించుకోవాలి.. ధర్మ దర్శనాలు ప్రజా ప్రతినిధులకే ఉండేది.. భక్తులకు ఉచిత దర్శనం అందించాలని మా పూర్వికులు చెప్పారు.. అందుకే ఒక్క క్యూలైన్ అయినా భక్తులకు ఫ్రీ దర్శనం అంచించాలని చూస్తున్నాం అని వెల్లడించారు మాన్సస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.
Read Also: Kurnool : కర్నూలులో బంగారు వెలికితీత ప్రారంభం! జిల్లాలో బంగారు నిక్షేపాల కోసం పరిశోధనలు వేగం.