Daughter Helps Mother Deliver Baby: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తల్లికి కూతురే పురుడుపోసింది. ఇది పరిషత్ కార్యాలయం చుట్టుపక్కల వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. తల్లి, బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువుకు డాక్టర్లు అత్యవసర వైద్యం అందించారు. తల్లి, శిశువును సురక్తితంగా ఉన్నారు.
గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని అక్కేన వలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి తన కూతురుతో కలిసి పని మీద మండల పరిషత్ కార్యాలయానికి వచ్చింది. అనూహ్యంగా కార్యాలయం ఆవణలోనే పార్వతికి పురిటి నొప్పిలు వచ్చాయి. దాంతో ఆమె కదలలేక అక్కడే ఉండిపోయింది. తల్లి పడుతున్న బాధలను చూసిన కూతురు.. దగ్గరుండి మరీ పురుడుపోసింది. పార్వతికి ఇది ఆరువ ప్రసవం కాగా.. ఈసారి కూడా ఆమెకు ఆడబిడ్డే జన్మించింది.
Also Read: iPhone 17 Price: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు! ఎంతో తెలుసా?
పార్వతి పరిస్థితి గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తల్లిని, శిశువును అంబులెన్స్ లో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ శశిభూషణ్ ఆధ్వర్యంలో ఇద్దరికీ అత్యవసర వైద్యం అందించారు. తల్లి, శిశువును సురక్షితమని డాక్టర్ వెల్లడించారు. పురుడుపోసిన పార్వతి కూతురును అందరూ ప్రశంసించారు. ఆమె అక్కడే ఉంది తల్లి బాగోలులు చూసుకుంటోంది.