అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.. సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. థర్డ్ వేవ్ వస్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారినపడితే ఏం చేద్దాం అనే దానిపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు.. ఇక, ఏపీ ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో…
విశాఖ మధురవాడ మారికావలస చిన్నారి సంధ్య శ్రీ కేసులో చిక్కుముడి వీడింది. ప్రియుడే హంతకుడు గా తేల్చారు పీఎంపాలెం పోలీసులు. వివాహేతర సంబంధమే చిన్నారి మృతికి కారణం అని పేర్కొన్నారు. భర్త నుండి విడిపోయిన భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డను అడ్డు తొలగించింది. ఇక చంపేసి అర్ధరాత్రి స్మశానవాటికలో చిన్నారి సంధ్య శ్రీ కి గుట్టు చప్పుడు కాకుండా అంతిక్రియలు చేసారు. పీఎంపాలెం పోలీసులు విచారణలో భయపడే విషయాలు చప్పుడు నిందితుడు జగదీష్.…
విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా…
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం…