ఏపీ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. అందుకు ఉదాహరణ విశాఖలో అత్యంత విలువైన 22 ఆస్తులను తనఖా పెట్టడమేఅన్నారు.. ప్రభుత్వం అప్పులు తీసుకోవడంలో తప్పులేదు.. కానీ, అన్ని కార్పొరేషన్లు దివాళ తీసేల ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు.. రాష్ట్రంలో అన్ని విలువైన భూములు అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించిన మాధవ్.. రాష్ట్రంలో ఆదాయవనరులపై దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని తనఖా పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్టాన్ని అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారని కామెంట్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ.. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. వైజాగ్ నాట్ ఫర్ సేల్ పేరుతో ఉద్యమం చేపడతామన్నారు ఎమ్మెల్సీ మాధవ్.. అనేక చరిత్ర కలిగిన భవనాలు అమ్మకానికి పెట్టడం దురదృష్టకరమన్న ఆయన.. గతంలో టిడిపి ఇదే తరహలో అమరావతిలో బాండ్లు సేకరించి అప్పులు తెచ్చింది … ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే చేస్తోందని విమర్శించారు.. విశాఖ ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదన్న ఆయన.. చట్టపరంగా ముందుకు వెళతాం.. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ భూములు అమ్మి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు.. ఫలితంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.