విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా…
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్‌డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం…
కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం అని చంద్రబాబు తెలిపారు. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది.అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పాగా కేసులు వస్తున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే ఏపీలోని అన్ని జిల్లాల కంటే విశాఖలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కర్ఫ్యూ కారణంగా విశాఖలో బీచ్ రోడ్డు బోసిపోయింది. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ తో విశాఖలో వీకెండ్ జోష్ కనిపించలేదు. కరోనా భయంతో విశాఖ వాసులు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం…
కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా…