బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.. విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో ఆ రెండెకరాలు భూమి కేటాయించారు.. ఇక, చిన గదిలిలోని సింధుకు కేటాయించిన భూమిని పశు సంవర్ధకశాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడెమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు వెలువరిచింది.. భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్.. కాగా, అకాడమీని రెండు ఫేజుల్లో నిర్మించనున్నట్టు ప్రభుత్వానికి తెలిపారు పీవీ సింధు.. ఒక్కో దశలో రూ. 5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.. అకాడమీ అవసరాలకోసమే ఆ భూమి ఉపయోగించాలని.. వాణిజ్య అవసరాలకోసం వాడకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్.. అకాడమీ ద్వారా ప్రతిభ ఉన్న పేదవారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.