అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో పాటు ఆక్సిజన్ స్థాయి కూడా మెరుగుపడిందని డాక్టర్లు చెప్పారు.