ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. విశాఖ జిల్లాలోని అందరికీ క్రమంగా మందులు అందిస్తామని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.. కోవిడ్ క్లిష్టసమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారియర్స్ కు ఆనందయ్య మందు గిఫ్ట్ గా ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఆనందయ్య మందు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలు తెగించి విశాఖలో పని చేశారని.. ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందన్నారు.. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అందిస్తున్నాం.. రెండో విడతలో జిల్లాలో ఉన్న ప్రజలు అందరికీ ఆనందయ్య మందు అందిస్తాం అన్నారు.. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా చెప్పిన ఆయన.. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణ చర్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ప్రశంసించారు.