విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే…
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ మాటేమోకానీ అక్కడ మాత్రం పిడికెడు ఇసుక.. బారెడు చర్చకు దారితీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య పంచాయితీని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఆ ఇసుక చుట్టూనే అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రాజకీయాలతో ఉద్యోగులు నలిగిపోతున్న సమయంలో.. రామాయణంలో పిడకల వేటలా జరుగుతోన్న ఆ చర్చేంటో ఈస్టోరీలో చూద్దాం. ఉన్నతాధికారుల దగ్గర వాదన వినిపించేందుకు డీసీ, ఏసీ సిద్ధం! విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారుల మధ్య పంచాయితీ అమరావతికి చేరింది. అంతర్గత విభేదాల కారణంగా…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…
దేవదాయ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. కార్యాలయంలోనే అధికారులు గొడవలు పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్… విశాఖ రగడపై రాజమండ్రి ఆర్జేసీ సురేష్ బాబుని విచారణాధికారిగా నియమించిన వాణిమోహన్.. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ఆర్జేసీని ఆదేశించారు.. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది… ఇక, ఈ తరహా ఘటనల విషయంలో అవసరమైతే ఉద్యోగుల టెర్మినేషన్ వరకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం.. కాగా,…
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి? విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్పై చర్చ విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80…
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్లో స్పష్టంచేసింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రకటించింది. ఆర్చి నుంచి వడ్లపూడి నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం…
కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.