రుషికొండ నిర్మాణాలపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి ఎంక్వైరీ చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు.
డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు.
విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో లో కిడ్నాప్ కలకలం రేపుతుంది. యాజమాన్యంలో ఉన్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు. మారికవలసలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ హెడ్ గా రమేష్ ను తోటి ఉద్యోగులు కిడ్నాప్ చేశారు.
విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.