జలవనరుల సమర్ధ వినియోగం, భవిష్యత్ సవాళ్లపై కీలకంగా చర్చిస్తున్న ఐసీఐడీ ప్లీనరీ సమావేశం జరిగింది. నీటి యాజమాన్య నిర్వహణ కోసం ప్రపంచ స్దాయి సాంకేతికతలపై ఐసీఐడీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డు ఛైర్మన్ కుష్విందర్ వోహ్ర మీడియాతో మాట్లాడుతూ.. ఒక సీజన్ ఆధారంగా ఈ ఏడాదిని కరువు కాలంగా నిర్ధారించలేం.. దేశంలో రిజర్వాయర్లు 71 శాతం నిండి ఉన్నాయి.. రానున్న రెండు దశాబ్దాలల్లో వాతావరణ మార్పు అనేది ప్రపంచం ఎదుర్కొనే అతి పెద్ద సవాలు.. ప్రస్తుతం సీజనల్ వర్షాల్లో 80 శాతం నాలుగు నెలల్లోనే కురుస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: BSNL Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్తో డేటా ఫ్రీ..!
ఈ తీవ్రత రానున్న కాలంలో మరింత పెరిగుతుందని అంచనాలు ఉన్నాయని సీబ్ల్యూసీ ఛైర్మన్ కుష్విందర్ వోహ్ర తెలిపారు. సిక్కింలో వచ్చిన హఠాత్తు వరదలు వంటివి అత్యధిక వర్షపాతం ఒకేసారి రావడం వంటివి ఉదాహరణ.. నదుల అనుసంధాన ప్రక్రియకు వివిధ రాష్ట్రాలు తమకు ఉన్న అడ్డంకులును అధిగమిస్తూ ముందుకు వస్తున్నాయి.. యూపీ, ఎంపీల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందమే ఇందుకు నిదర్శనం.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సాంకేతికత ఇప్పుడు బాగా ఖర్చుతో కూడుకున్నది.. భవిష్యత్తులో ఇది తగ్గేందుకు అవకాశం ఉందన్నారు. మనకు ఉన్న నీటి వనరుల నుంచి వాడే నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో తిరిగి వినియోగిస్తున్నాం.. ఇప్పుడు మరింత మెరుగైన పద్దతులు క్షేత్రస్దాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కుష్విందర్ వోహ్ర వెల్లడించారు.