విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని స్పష్టం చేశారు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుని ఆదేశించారు సీఎం జగన్.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాల నాయకులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి వారికి మద్దుతు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిశ్రమ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నంలో వైసీపీ సీనీయర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలో ఈ నెల 25 తేదీన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరు అని ఆయన పేర్కొన్నారు.
జలవనరుల సమర్ధ వినియోగం, భవిష్యత్ సవాళ్లపై కీలకంగా చర్చిస్తున్న ఐసీఐడీ ప్లీనరీ సమావేశం జరిగింది. నీటి యాజమాన్య నిర్వహణ కోసం ప్రపంచ స్దాయి సాంకేతికతలపై ఐసీఐడీ తీర్మానం చేసింది.
ఋషికొండపై కట్టడాలను కోర్టులు కాదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ప్రశ్నించారు.. మంత్రి బొత్స.. కోర్టులను ఎవరూ కాదనలేరన్న ఆయన.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండపై నిర్మాణాలు చేపట్టాం అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
ఈనెల 13 నుండి 27వరకూ మూలపాడులో బీసీసీఐ అండర్-19 క్వాండరంగల్ వన్ డే మ్యాచ్ లు జరగబోతున్నాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తెలిపారు.