విశాఖపట్నంలో వైసీపీ సీనీయర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలో ఈ నెల 25 తేదీన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరు అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ప్రోత్సహించిన పార్టీ వైసీపీనే అని వైవీ తెలిపారు. 30 లక్షలు మంది ప్రజలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేసిన నాయకుడు జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గొప్పగా చేయడం అభినందనీయం అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Read Also: Delhi High Court: మైనర్‌ను కాజువల్‌గా తాకడం పోక్సో కింద లైంగిక నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు
ప్రతి నెల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము.. ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మకుండా వైఎస్సార్ పార్టీకి ఓటు వేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. గత ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం 2019 నుంచి ఇప్పటి వరకు మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసామని చెప్పారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాము అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.